పల్లవి:యెహోవ యందు భక్తి బహుగ గలిగియుండి మహిమాఢ్యుని మార్గంబులయందు గృహముల నడుపు నరులే ధన్యులు||
1. దేవుని యందలి భయము దీనుల దీవించున్ నీవు నీ జేతుల కష్టార్జితమును నిత్యము ననుభవంతువు నిజముగ ||
2. ఉల్లమలర భార్య ద్రాక్షా వల్లివలె ఫలించు పిల్లలొలీవ మొక్కల చందము పెంపొందుదు రెంతయు సొంపుగను ||
3. దేవుని భక్తియే నీ కిల దీర్ఘాయువు నిచ్చు( గావున నీ పిల్లల పిల్లలను గాంతువు ప్రభు కృపతోఁ వెలగుదువు ||
