కీర్తనలు

516. క్రైస్తవ గృహము

రాగం: బిలహరి|తాళం: త్రిపుట|రచయిత: సి.విజయ చార్లెస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుక్రీస్తుని దాసులారా మీ సుతులకును నేర్పరె ఆశతో యెహోవ యాజ్ఞల నభ్యసింపగ జేయరే ||యేసు||
1.  పిల్లలెప్పుడు ననుసరింతురు తల్లిదండ్రుల నడతలన్ ఎల్ల విషయము లందు మాదిరి పిల్లలకు గనుపర్చరే ||యేసు||
2.  మోదమిచ్చు కుటుంబ ప్రార్థన నేదినంబును మానక ఆదివారపు బడికి బిడ్డల నాదరముతో బంపరే ||యేసు||
3.  యేసునాధుని బోలు నాయకు డే జగంబున లేడని యేసు కే నిజ శిష్యులగుటకు నేర్పరే యౌవనులకు ||యేసు||
4.  యేసు శౌశీల్యమును వారికి బోధింపరే పసితనమునె వారి హృదయము యేసురూపము దాల్చును ||యేసు||
5.  యేసుక్రీస్తులొ నిలిచి వారలు యేపుమీర ఫలింపగా యేసు వాక్యము వారి యెదలలో నాశతోడను నాటరే ||యేసు||