← కీర్తనలు

513. When all my labours

రచయిత: చార్లెస్ హోమర్ గాబ్రియేల్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శృంగార దేశము చేరఁగానే నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్ యేసుని యొద్దను నిత్యమునే నుండుట మిక్కిలి యాశ్చర్యము ||ఇదే నాకు ఆనందము ఆనందము, ఆనందము నేను ఆయనను జూచుటయే ఇదే నాకుఁ బరమానందము||
1.  అమితమైన కృపవలన నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతి కీర్తనలు పాడుదును.
2.  నేను ప్రేమించు స్నేహితులును అక్కడఁ జూచి సంతోషింతును నాయేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము.
3.  ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతోఁ జూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతోఁ జూచి సంతోషింతును