← కీర్తనలు

514. కుటుంబారాధన

రాగం: కురంజి|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుముర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవర బ్రోవుమా దీన కుటుంబమున్ దీవెన లొసగుచు ధాత్రిని నడుపుమా ||దేవర||
1.  పావనమగు స్వ భావము నిమ్మా పాలించర మా పాలిటిదైవమ ||దేవర||
2.  యేసు ప్రభువ మా యింటికి శిరసుపై వాసముజేయు మా యందున నిలువుమ ||దేవర||
3.  అనుదిన భోజనం బనుగ్రహించి మా పనిపాటులలో ప్రక్కను నిలువుమ ||దేవర||
4.  పిల్లల పెద్దలన్ బెంచుమ ప్రేమతో నెల్ల సమయముల యందున గావుమ ||దేవర||
5.  అణకువ త్యాగము నతిధి సత్యార్యముల్ గణుతించుచు నిను గొలుతుము దేవ ||దేవర||
6.  నీ పరిశుద్ధత నేర్పుము యేసువ కాపరి వీవై కాయుము మమ్ము ||దేవర||
7.  క్రైస్తవ జీవము క్రమముగ నొందుచు ప్రస్తుతింతుమో ప్రభువా బ్రోవుమ ||దేవర||