← కీర్తనలు

512. మోక్ష రాజ్యము

రచయిత: ఈ.డి.నిత్యానందము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం ||స్వతంత్ర||
1.  ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం ||స్వతంత్ర||
2.  మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్ యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్ ||స్వతంత్ర||
3.  సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్ ||స్వతంత్ర||
4.  నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వతంత్ర||
5.  జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్ దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్ ||స్వతంత్ర||