← కీర్తనలు

511. మోక్షాపేక్ష

రాగం: జంఝూటి|తాళం: ఆది|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏదియది యేదియది యేదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు బహుళ దుఃఖ పాశము ||ఏదియది||
1.  సిలోమను కొలను గల జీవన ప్రదేశము పాలు తేనె లొల్కు నట్టి పరమ కానాన్ దేశము ||ఏదియది||
2.  ఆయతమై యున్నదది యమర జనుల కోసము సీయోనను పేరుగల శ్రీకరుని నివాసము ||ఏదియది||
3.  జీవ ప్రవాహములు గల జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కెరు బుల స్వదేశము ||ఏదియది||
4.  యేసు జన స్వాస్థ్య మిదే యిశ్రాయేలు దేశము మేసయ్య యను రాజుసదా మృతములిడు దేశము ||ఏదియది||
5.  కోరికలు దీరునట్లు గొబ్బుననేఁ బోదురా చేరి సౌఖ్యమొంద మదిని స్ధిరతఁ బూని యుంటిరా ||ఏదియది||
6.  మరణమును యోర్దాన్ నది మధ్యమందు గంటిరా తరుణమునేఁ గాచి దాని దాటిపోవ నుంటిరా ||ఏదియది||
7.  కాలు ధరను నిల్వదది కండ్లుఁబడు దాకరా మేలుకొని యుంటిరా మేర దాట లేకరా ||ఏదియది||