← కీర్తనలు

510. మోక్ష వర్ణన

రాగం: శహన|తాళం: త్రిపుట|రచయిత: తూపిలి దానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము యా పురము ||దేవ||
1.  దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము ||దేవ||
2.  పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు పురము ||దేవ||
3.  ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము ||దేవ||
4.  శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల భాసురము ||దేవ||
5.  వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము ||దేవ||
6.  కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే సుస్థిరము ||దేవ||
7.  క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు దుస్తరము ||దేవ||
8.  ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము ||దేవ||
9.  మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము ||దేవ||
10.  సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురముఁ గావించు గరము ||దేవ||
11.  సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి సంపత్కరము ||దేవ||
12.  ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు మా పురము ||దేవ||