కీర్తనలు

509. పరలోక వర్ణన

రాగం: శహన|తాళం: చాపు|రచయిత: చదలవాడ జకర్యా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చక్కని పరలోక సంబంధులతో గూడి సంతోషించుట యెన్నడో మిక్కిలి ప్రియమైన తండ్రి దేవుని యెదుట మ్రొక్కి పాడుట యెన్నడో ||చక్కని||
1.  నిత్యమ్ము విలసిల్లు నిజరత్నపునాదు ల త్యుత్తమ పురమున ముత్యాల ద్వారముల ముదముతో బోవుచు నృత్యమెప్పుడు చేతుమో ||చక్కని||
2.  పన్నెండు ద్వారముల పరమపురమును నా కన్నుజూచుట యెన్నడో చెన్ను మీరఁగ భక్తశ్రేష్ఠులతోఁగూడి సన్నుతించుట యెన్నడో ||చక్కని||
3.  పరిశుద్ధదూతలతోఁ ప్రభుయేసు మరల యీ ధరకేతెంచుట యెన్నడో పరిపూర్ణులతోఁ గూడి బహుమానమును బొంది మురియు చుండుట యెన్నడో ||చక్కని||
4.  మహిమకిరీటము ధరియించియున్న యా మహితు నిగను టెన్నడో అహహా యా ప్రభునితో మహిమపరచబడి మహికేతెంచుట యెన్నడో ||చక్కని||
5.  పాపశరీరముఁ బాసి ప్రభుని యొక్క రూపునొందుటయెన్నడో పాప మరణ దుఁఖ మీ యాపదల కెడ బాపు నొందుట యెన్నడో ||చక్కని||
6.  రమ్మురమ్ము యేసు మమ్ము నీ పురముకొని పొమ్ము వేవేగమునే ఇమ్మహికష్టములనుండి నెమ్మది ని త్యమ్ము నిమ్ము వేగమే ||చక్కని||