← కీర్తనలు

508. పరలోకపు విందు

రాగం: జంఝూటి|తాళం: ఏక|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా నందము నొందు ||విందు||
1.  సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను రండు ||విందు||
2.  నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె సత్యము రండు ||విందు||
3.  ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట నిజము దత్తము రండు ||విందు||
4.  పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును గూర్పఁబడినవి రండు ||విందు||
5.  నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రండు ||విందు||
6.  దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను జేతురు వినను రండు ||విందు||