← కీర్తనలు

507. పరమ యెరుషలేము

రాగం: బంగాలాఝురి|తాళం: ఆది|రచయిత: మేడికాయల సాధువు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో సోదర తిర మగు పురమది దివ్య సుందరము తరముగాదు త ద్దయు వర్ణింపగ ||బరమ||
1.  ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు ||బరమ||
2.  శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు ||బరమ||
3.  పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును ||బరమ||
4.  కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నఁగ మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలఁగును ||బరమ||
5.  పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు ||పరమ||
6.  రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును ||పరమ||
7.  సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని ||పరమ||
8.  ఆఁకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర ప్రాకటముగ జీ వ జలంబచ్చట నీకు నొసంగును నిరతము వరదుఁడు ||పరమ||
9.  ప్రభు సన్నిధినుండి పారును శుభనది సుఖ మియ్యన్ సోదర యుభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ ఫలమిడు ||పరమ||