కీర్తనలు

495. విశ్వాసి పునరుత్ధానము

రాగం: యదుకులకాంభోజి|తాళం: రూపకము|రచయిత: తూలూరి కొర్నేలియస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ||
1.  క్షయమందు విత్తఁబడి య క్షయమునందు లేచురా ప్రియుడు క్రీస్తునందు మృతులు పెం పొసంగు ధన్యులు ||మరణ||
2.  లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను యేసు ప్రేమతో దాఁటించురా ||మరణ||
3.  ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము పరమ దేవుని డుండునట్టి పరదైసునకుఁ బోదుము ||మరణ||
4.  గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల నొక్క క్షణములో బ్రతికించురా ||మరణ||
5.  బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు జీవ ధారులై లేచెదరురా ||మర||
6.  భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము ధరించి రక్తితో జీవింతురు ||మరణ||
7.  కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన ప్రభుని చరణములు నుతించుఁడీ ||మర||