కీర్తనలు

494. భూస్థాపనము

రాగం: అసావేరి|తాళం: చాపు|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని సదయుఁడగు తండ్రి చక్కగా దాచు సదమలంబగు లోకమున నీ సదనమందునఁ జేర్చి శుద్ధుల వదల కెప్పుడు వారితో నీ పదయుగంబుల సేవఁగోరుచు ||నిదురఁ||
1.  ఇతఁడీలోకమందు నీవొసంగిన పని హితమతి నొనరించె యేసుని కృపను సతతమును బాపంబుతోడను జాల యుద్ధ మొనర్చి బ్రదుకును నతిముదంబున నీకు నిరతము నుతు లొనర్చెడు నాశఁబూనుచు ||నిదురఁ||
2.  సన్నిధిఁ జేరిన సకల వరభక్తుల కన్నీరు దుడుతువు కరుణ మీరంగ నిన్ను నమ్మినవారి నడువడి నీవు తేటగ నెఱింగా వారికి జెన్ను గను దీర్చె దవు న్యాయము సన్నుతింపగ సజ్జనావన ||నిదురఁ||
3.  మరణ కాలంబున ధరలోఁ క్రీస్తుని సిలువ దిరముగఁ జూచిన నరులందఱు వరదుఁడగు రక్షకుని దయచే జిరపురము నిక్కముగఁ జేరుచు గరము నేర్తురు ప్రేమ నచ్చటఁ దరతరంబులు గడుచుచుండగ ||నిదురఁ||
4.  పరిశుద్ధుఁడగు దేవ పాదసన్నిధిలోనఁ బరిపూర్ణానందము పాదు కొని యుండు నరక బలములు చెరుపనేరవు పరమ జనకుని సుతుల నెమ్మదిఁ జిరదయాళుఁడు గాచు వారల నిరతమును దన యాత్మ బలమున ||నిదురఁ||
5.  యేసుబాధుని నమ్మి యిలను విడిచినవారు భాసిల్ల లేతురు ప్రభుశక్తి నిలను భాసురంబగు దేహములు తన దాసు లందఱి కిచ్చి మోక్షని వాసులముగాఁ జేసి వారల యాస దీర్చును మాటఁ దప్పక ||నిదురఁ||