← కీర్తనలు

493. క్రైస్తవునిమరణము

రాగం: అఠాణ|తాళం: అట|రచయిత: బర్నార్డ్ లూకాస్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జీవము పోవగన్ దేవుని సన్నిధి జీవుడు చేరున్ ||జీవము పోవగన్||
1.  పుష్పము రాలగన్ బాష్పము లేలన్ ఋష్పమువాడిన ఋష్కల ఫలమగున్ ||జీవము పోవగన్||
2.  నిధన మొందగ నిద్దుర పోవుటే రోదనముండదు బాధముగించెన్ ||జీవము పోవగన్||
3.  నష్టము భావమై కష్టము దీరున్ ఇష్టముతో ప్రభు యింటను జేర్చును ||జీవము పోవగన్||
4.  పరమున జొరగన్ హర్షమునొందన్ మరణము గెల్చిన సర్వదా ||జీవము పోవగన్||
5.  యేసుఁడు లేచెన్ దాసుఁడు లేచున్ భాసుర గృహమున వాసము చేయున్ ||జీవము పోవగన్||