కీర్తనలు

492. పరలోక నిరీక్షణ

రాగం: కమాసు|తాళం: త్రిపుట|రచయిత: బూల జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి యుంటిమి నీ తట్టు భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు నీవైపు ||వేచి||
1.  కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్ స్తుతియింప ||వేచి||
2.  నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్ ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్ నమ్మబల్కిన మీకై ||వేచి||
3.  వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్ కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు టెప్పుడొ యంచు ||వేచి||
4.  నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో ||వేచి||
5.  రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై ||వేచి||