కీర్తనలు

482. క్రైస్తవ యాత్ర

రాగం: బిలహరి|తాళం: అట|రచయిత: విలియం డానన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు డేసునిఁ గూడి ||పదరే||
1.  ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద కున్న నష్టము గల్గుఁ ||బదరే||
2.  ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త సరణిఁ గన్గొని వడిగఁ ||బదరే||
3.  ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో టను నా పాటే దీరుఁ ||బదరే||
4.  పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక సరకు సేయుము పద ||బదరే||
5.  ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు అహహా యేసుని జూడ నధిక సంతోషంబు ||పదరే||
6.  మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి తోడుగ నునిచె వేగము గూడి ||పదరే||
7.  భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా సక్తితోఁ జూతము ||పదరే||