← కీర్తనలు

481. లోక సౌఖ్యత్యజనము

రాగం: పున్నాగ|తాళం: త్రిపుట|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు గాలమైయున్న భోగములు ||చాలును||
1.  ఎండమావులే నీరనుచు మెండుగఁ బరుగిడు జింక కుప మండనై బలహీను నైతిఁ ||చాలును||
2.  బూరుగ పండారగింపఁ గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి నయ్యో ||చాలును||
3.  దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతిఁ బాపపు భ్రమచే నట్లయితిఁ ||చాలును||
4.  పూలతో ఁటయందుఁ బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతిఁ ||చాలును||
5.  చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నేఁ గాఁగ సత్యము నిష్ఫలమయ్యొ నకట ||చాలును||
6.  మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన రుంచి నాపైఁ ||చాలును||
7.  తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండఁ జేయ ||చాలును||
8.  మంచు పోల్కె ననుఁ జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలోఁ బెంచుమి నీ వాక్సారము చేఁ ||చాలును||
9.  చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్నుఁ బ్రోవు ||చాలును||