← కీర్తనలు

483. జీవిత యాత్ర

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: గొల్లపల్లి నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగఁ ||బరదేశుల||
1.  చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల||
2.  సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణఁగున్ నిజముగఁ ||బరదేశుల||
3.  స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగఁ ||బరదేశుల||
4.  మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనఁబడవే నిజముగఁ ||బరదేశుల||
5.  ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగఁ ||బరదేశుల||
6.  ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||
7.  వచ్చితి మిచటికి వట్టి హస్తములఁ దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల||
8.  ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికిఁ ||బరదేశుల||
9.  యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నినుఁ జేర్చున్ బరమున ||బరదేశుల||
10.  యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||బరదేశుల||