కీర్తనలు

476. యేసు భాద్యత

రాగం: రేగూప్తి|తాళం: ఆది|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని దాసులనందరిని దరి జేర్చుటకును వాసికెక్కి పరవాసము చేసెడి ||యేసుని||
1.  ఆదియందు భూమ్యాకాశంబుల శక్తి ఆత్మ నింపార సృజించిన ||యేసుని||
2.  శత్రువులగు జనసంఖ్యను బొడగని మిత్రుడగుచు దనమేను నొసంగిన ||యేసుని||
3.  పాపులెల్ల దనప్రాపుగోరుకొని దాపుగరండని దయచేఁ బిల్చెడి ||యేసుని||
4.  సకల శుభంబులు చక్కఁగ నిచ్చుచు సకలభక్తులను సమముగఁ జూచెడి ||యేసుని||
5.  తన్ను నమ్ముకొని యున్న దీనులకు దన్నుగ నుండెడి సన్నుతుడగుమా ||యేసుని||
6.  చక్కని గుణములు లెక్కలేక తన చక్కని యాత్మను చిక్కగఁబట్టిన ||యేసుని||
7.  లోకమంతయును లోఁబడుచుండఁగ నేక ప్రభువై యేలుచుండుమా ||యేసుని||