కీర్తనలు

475. మంచి క్రైస్తవుల గుణములు

రాగం: ఆనందభైరవి|తాళం: అట

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వారె మంచి క్రైస్తవులు గదా యీ లోకమందు వారె మంచి క్రైస్తవులు గదా చేరునట్లు చేయుడి. పారమార్థమైన క్రీస్తు సారవాక్య మనుభవించు వారి దారి గోరి జేరి భూరిసుఖముఁ బడయునట్టి ||వారె మంచి||
1.  కపట వేష భాష లెల్లను తొలంగఁ ద్రోచి విపుల భక్తి నిపుణు లగుచును లపితములు నసత్యములును శపధములును లేక దేవ కృప మనంబులోన వెలిగి యుపరిభాగ మరియునట్టి ||వారె మంచి||
2.  నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగి మెండుగా క్రమ్ము కొనెడి శ్రమలయందు సొమ్మసిలక ప్రభుని పా దమ్ములందు బుద్ధి నిలిపి నెమ్మది గలవార లెవరో ||వారె మంచి||