← కీర్తనలు

477. ఇహలోకము విశ్రాంతి లేనిది

రాగం: శుద్ధకాంభోజి|తాళం: కురుజంపె|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున చొరకున్న లేదు సుఖ మెచట ||నేది||
1.  కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక ||నేది||
2.  కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ మొందెద వి చార మిఁక నేల ||నేది||
3.  యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా కన్నీళ్లు చింత లెడఁబాపి ||యేది||
4.  ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు ||నేది||
5.  నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని పాడి చని పరమసుఖి నౌదు ||నేది||