← కీర్తనలు

460. సువార్త ప్రకటన

రాగం: హరికాంభోజి|తాళం: త్రిపుట|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
చాటుఁడి శుభవార్తను బోధకులారా చాటుఁడి శుభవార్తను జాటుఁ డి శుభవార్త సకల రాష్ట్రములలోఁ జాటించుఃడని చెప్పె ఢాటిగఁ ప్రభు యేసు ||జాటుఁడి||
1.  లోకమును ప్రేమించి లోకరక్షణ కొఱకు ప్రాకటంబుగ సుతునిఁ బంపె దేవుఁడటంచుఁ ||జాటుఁడి||
2.  శత్రువుల రక్షింప మిత్రుఁడుగా వచ్చి మైత్రి నసుపు నిచ్చి మరల లేచెన టంచుఁ ||జాటుఁడి||
3.  ఎట్టి పాపు లైనఁ బట్టి యేసుని మాట దిట్టముగ నమ్మినఁ బట్టుగ క్షమియించుఁ ||జాటుఁడి||
4.  హృదయ శుద్ధిని గోరి సదయుఁడగు రక్షకునిఁ పదిలముగఁ ప్రార్ధింపఁ పరిశుద్ధాత్మ నొసంగుఁ ||జాటుఁడి||
5.  నమ్మి బాప్తిస్మంబు నెమ్మిఁ బొందిన మనుజు లిమ్ముగఁ బొందుదు రిలను ఘన రక్షణముఁ ||జాటుఁడి||
6.  ఇందు నందు మికుఁ బొందుగ నొసఁగును సందియము లేకుండ సకల భాగ్యము లనుచుఁ ||జాటుడి||