కీర్తనలు

459. ఎవరు ప్రభుని పక్షమున నున్నారు?

రాగం: యదుకులకాంభోజి|తాళం: ఆది|రచయిత: టి.గురవయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు||
1.  నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుఁడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవఁజేయ ||నెవరు||
2.  లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ సైన్యమందుఁ జేగి సయితాను నెదిరించి గెలువ ||నెవరు||
3.  మరణమందు గూడ మాకుఁ గరుణఁ జూపిన యేసు నీ కొ మరులమై మేమందఱము నీ దరికిఁ జేరి యున్నాము ||ఎవరు||