← కీర్తనలు

461. ఆత్మల సంపాదనము

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: మల్లెల దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఆత్మలను సంపాదింపఁ నగు ఆత్మ బలమున నిది చేయనగు ఆత్మ సంపాదనముకన్న నక్షయానందము లేదన్న యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యాన తిడి ||నాత్మలను||
1.  ధనముకన్న నాత్మ సంపా దనము మేలౌ దాని సంపా దనముఁ గోరి మన రక్షకుఁడు ధారపోసెను దన రక్తంబు ||నాత్మలను||
2.  క్షణక్షణము నెందఱో నశింప జాలిలేద నీవు సిఖింప అణఁకువతో ననుదిన మొక యాత్మ నైన రక్షింపఁగ దయ రాదా ||యాత్మలను||
3.  పరుల యాత్మ విమోచనంబు ప్రభువు కోరు బహుమానంబు పరదుఁ డౌ క్రీస్తును నీవెట్లు వట్టి చేతులతో దర్శింతు ||నాత్మలను||
4.  నీతిమార్గము ననుసరింప నిత్యమును జక్కఁగ వర్తింపఁ పాతకులఁ ద్రిప్పెడు సద్భక్తుల్ జ్యోతులట్లు బ్రకాశించెద రిఁక ||నాత్మలను||
5.  జీతనాతంబులు లేవని సిగ్గుపడకు మిది కాదని ప్రీతితో నాత్మలను గడింప నీతి మహిమ మకుటంబులునౌ ||నాత్మలను||
6.  నీ యమూల్య తరుణంబుల నీ ప్రశస్తదానంబుల వేయియేల నీ సర్వంబు విభుని సేవకు నీ వర్పించు ||నాత్మలను||