← కీర్తనలు

444. జ్యోతిగ మము జేయుము

రాగం: ఆనందభైరవి|తాళం: చాపు|రచయిత: పి.డి.శుభామణి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జ్యోతిగ మము జేయుమో దేవా యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ||
1.  మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించు నట్లుగ నాదు బ్రదుకును శుద్ధి జేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు జూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా ||జ్యోతిగ||
2.  సంఘమున నీ కీర్తి కనపడగ పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి జేయు మయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శక్తులన్నిటి పార దోలగ శక్తినిడి నీ భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ||
3.  నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయా అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగ ||జ్యోతిగ||
4.  సమయమును వరముల నొసంగితివి మా రక్షకా ధన సంపదను నీవే యొసంగితివి విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి వీర త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ||