కీర్తనలు

445. నేను నీ సేవకుఁడను

రాగం: ముఖారి|తాళం: అట|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నేను నీ వాఁడను దేవా నిక్కంబుగ నేను నీ వాఁడను దేవా వీనుల నీ ప్రేమ వివర మాలించుచు మేను నాత్మయు నిత్తు మేలొసఁగు నీకిపుడు ||నేను||
1.  ఘనుఁడ వైన నీవు గలిగించితివి నన్ను మనుజ లోకమునందు నిను నేను సేవింప ||నేను||
2.  నాకు నవసర మౌన నానా వస్తువు లిచ్చి నీ కటాక్షము నన్ను నిల్పుచున్నది గాన ||నేను||
3.  నా దోషముల నుండి నన్ను రక్షింపను నీదు పుత్రుని ప్రేమ నిండార నొసగితివి ||నేను||
4.  నే నఘముల చేత నిజముగఁ జావఁగ నీ నెనరుచే నన్ను నీవు బ్రతికించితివి ||నేను||
5.  నా తనువు నాత్మయు నాకుఁ గల్గిన వన్ని నా తండ్రి యిచ్చితివి నాకు నీ కృప చేత ||నేను||