కీర్తనలు

443. సంపూర్ణ సమర్పణము

రాగం: యమన్|తాళం: ఆది|రచయిత: వేశపోగు గుల్బానమ్మ

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శ్రీ యెహోవా నీ కొసంగెద శ్రేయ మొదవఁగ నాదు సంపదఁ బాయక నీ సమ్ముఖమ్మున నే యెడ నివసింతు భక్తితో ||శ్రీ||
1.  అడఁకువతో నీ పాదములఁబడి యొడయుఁడా నావెల్ల నీకిడి తడవు చేయక కొల్తు నిన్నుఁ దండ్రి నన్నంగీకరించుమి ||శ్రీ||
2.  నీవు నా రాజువు నిరతము నేను నీ బిడ్డను నిశ్చయము పావనాత్ముని యెదుట నాదు జీవ మిడుదు సజ్జీవనముకయి ||శ్రీ||
3.  ప్రభువరా యర్పించుకొందు భక్తితోడ నన్ను నిందు శుభప్రదము లగు శక్తులతో నను సొంపుమీరఁగ నింపు స్వామీ ||శ్రీ||
4.  మహిమస్తుతులు చెల్లు నీ నా మంబునకు నిత్యంబుగా న న్నిహ పరంబుఁ బ్రోచువాఁడ నీవె సుమ్మా లోక రక్షకా ||శ్రీ||