← కీర్తనలు

422. మంచికాపరి

రాగం: కమాసు|తాళం: ఆది|రచయిత: మల్లెల సొలొమోను జార్జి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి ||యెహోవా||
1.  పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ జక్క గా నడిపించు ||యెహోవా||
2.  ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు ననుఁ బట్టి నడిపించు ||యెహోవా||
3.  గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు నన్నెపుడు ||యెహోవా||
4.  నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు కఱ్ఱయును దండంబు ||యెహోవా||
5.  నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద లంటె నూనెను బోసి ||యెహోవా||
6.  నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా దయలు వెంటాడు ||యెహోవా||
7.  పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే నిరతంబు నివసింతు ||యెహోవా||