కీర్తనలు

423. యేసు సర్వశక్తుడు

రాగం: జంఝూటి|తాళం: చూపు|రచయిత: చదలవాడ జోనా

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా సర్వపాపముఁ బరిహరింప నీ సర్వమహిమను విడితివా ||సర్వ||
1.  నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపముఁ బాపి మరి నీ నిత్య జీవము మాకునీయను మృత్యు బాధలు పడితివా ||సర్వ||
2.  పాపమరణపు బంధకములనుఁ దెంపి మము విడిపించుటకు మా పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా ||సర్వ||
3.  మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిఁక నీ కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ ||సర్వ||
4.  సత్యవిధులలో నడువనే న శక్తుఁడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి నడి పింపు నీ ఘనసేవలో ||సర్వ||
5.  నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు సాధు నిగ ననుఁ జేసి సాయము నాధుఁడా నాకీయుమా ||సర్వ||
6.  ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు నీ స్తోత్రముల్ పర వస్తు ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్ ||సర్వ||
7.  ముక్తినుంచి నీవు రాగా శక్తితోఁ ప్రభు యేసువా యా సక్తితో నినుఁ గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము ||సర్వ||