కీర్తనలు

421. యేసు శరణుజొచ్చుట

రాగం: కేదారగౌళ|తాళం: త్రిపుట|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే ||శరణు||
1.  కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే ||శరణు||
2.  మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో ||శరణు||
3.  తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త బోధల సిద్ధపడి విననీయవే ||శరణు||
4.  శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి మాయ లోకపు గాంతి నీరస మంచు నీ ||శరణు||