← కీర్తనలు

420. క్రీస్తు కరుణయం దాశ్రయించుట

రాగం: ముఖారి|తాళం: అట|రచయిత: మిక్కిలి సమూయేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసు కరుణ యిదియే మా శరణు యేసు కరుణ ||
1.  యేసుని కరుణ యిదే మాకు శర ణని యాసతో నమ్మిన యధముల కెల్ల ||యేసు||
2.  ఎన్నిక సేయక యే పాపి నైనను మన్నించి బ్రోచెడు మా దేవుఁడైన ||యేసు||
3.  పశ్చాత్తాపము నొందు పాపుల నెల్లను నిశ్చయముగఁ బ్రోవ నిపుణుఁ డై యున్న ||యేసు||
4.  దిక్కు లేకున్నటి దీన జనాత్ములఁ జక్కఁగఁ బ్రోచెడు సదయుఁ డైయున్న ||యేసు||