పల్లవి:
యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను వాసిగా నీ రొమున నుండఁ జేసియు జల రాసులను నీవు తీసివేయుము మోసములఁ ద్రోసి ||యేసూ||
1. జీవబాధ నే దాఁటుదాఁక నన్ను నీవె దాఁచము నా రక్షక రూపునకు నడ్పి ప్రోవు మో యేసు దేవ యాత్మను జీవమును జేర్చు ||యేసూ||
2. ప్రాపు లేని నా యాత్మన్ నీవు నీదు దాపునకుఁ జేర్చి ప్రోచి కావు మో పరమాత్ముఁడా యోపికతోఁ జూచి యాపదలఁ బాపి యాదరించుము ||యేసూ||
3. నా నమ్మకము నీ యందున్నది నీలో నేను గోరు సాయంబున్నది గాన నేఁ బ్రాపు లేని నా తలను బూని రెక్కల లోన గప్పుము ||యేసూ||
4. యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల మిమ్మో యేసు రోగులకు వాసిగాఁ జీకు వారలను నడ్పి ||యేసూ||
5. నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధుఁ డేడి కేవలము సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుఁడవు స్వామి ||యేసూ||
6. నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము ||యేసూ||
7. నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా యెదలోఁ గావఁగ లేచి జీవపదవికిఁ ద్రోవ దీయుమా ||యేసూ||
