← కీర్తనలు

415. దేవుని నాశ్రయించుట

రాగం: కాపి|తాళం: ఆది|రచయిత: ఎస్ ఎస్ షేతు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఓ దేవా నన్నుఁ బ్రోవ నీదె భార మయ్య రావే ||యో దేవా||
1.  స్వామి స్వామి యన నా భారం ప్రేమఁ జూపను నీ భారం పామరుఁ డ నన నా భారం పాపిం బ్రోవను నీ భారం ||బో దేవా||
2.  నెనరు తండ్రి యన నా భారం ననుఁ గనులఁ జూడను నీ భారం నిన్నే నమ్మ నాదు భారం నన్నెపుడు కావ నీ భారం ||బో దేవా||
3.  కరుణ సాగర యన నా భారం కరుణం జూపను నీ భారం శరణని వే డను నా భారం సంతరింప నీ భారం ||బో దేవా||
4.  మనవి సేయ నాది భారం తనవిఁ దీర్పను నీ భారం నిను మది దలఁ ప గ నా భారం నన్ను గా వనీ భారం ||బో దేవా||