← కీర్తనలు

414. యేసుని ప్రేమ

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నీవే నా ప్రియుఁడవు యేసు ప్రభు నీవే నా యొడయుఁడవు నీవే యనాది దేవ పుత్రుండవు నీవే లోక మెల్ల నేర్పుగఁ జేసితివి ||నీవే||
1.  పరమందు నీకుండు పరమభాగ్యంబులు నరకాయత్తుఁడ నైన నా కొరకు విడిచితివి ||నీవే||
2.  నీవే ననుఁ బ్రోవ నెనరు నేతెంచి నీవొలుక బోసితివి నీ నల్ల సిలువపై ||నీవే||
3.  నేనెవరిఁ బ్రేమింతు నీ కంటె లోకమున నే నెపుడు మరువను నీ ప్రేమ నాకర్త ||నీవే||
4.  నీ సేవ నేఁ గోరి నిన్నే ప్రతిపరతు నీ సేవకుఁడ నైన నే నెట్లు నిను విడుతు ||నీవే||
5.  సకలంబు నేలెడి చక్కని రాజవు సకలాధికారంబు చక్కఁగం చేయుదువు ||నీవే||
6.  నీ సేవకుల నెల్ల నేర్పుగా నేలెదవు నీ సేవకులు పొంద నిత్య సహాయంబు ||నీవే||