← కీర్తనలు

416. క్రీస్తు విశ్వాసుల కాశ్రయము

రాగం: ఖరహరప్రియ|తాళం: రూపకము|రచయిత: పసుపులేటి దావీదు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నాధ యేసు నాధ క్రీస్తు నాధ నేననాధ సాధు జనులఁ బ్రోచు సదయు నీ దయ కాదా ||నాధ||
1.  గతిఁ దలఁపని మూర్ఖచిత్త గమనుఁడనే గానా సతతముననుఁ గరుణఁ బ్రోచెడు గతియ నీవు కావా ||నాధ||
2.  పాపమందు జననమైన పామరుండ నేఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ||
3.  కుటిల బుద్ధిగల వాఁడను క్రూరుఁడ నేఎఁగానా కటకట ననుఁ గని కరించు కరుణ నీది గాదా ||నాధ||
4.  ఆది కర్త వీవు గావె యఖిల లోకమునకును బీదవారి నెల్లఁ బ్రోచు బిరిదు నీది గాదా ||నాధ||
5.  సారమైన సత్యశాస్త్ర సార మీవు గావా ఘోరమైన పాపి జనులఁ గోరి పిలువ లేదా ||నాధ||
6.  జీవ నాధారమైన త్రోవ నీవు గావా దేవదేవ యెహవా నా దిక్కు నీవు గావా ||నాధ||