పల్లవి:
దేవుఁడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము మ హా వినోదుఁ డాపదల స హాయుఁడై నన్ బ్రోచును అభయ మభయ మభయ మెప్పు డానంద మానంద మానంద మౌఁగ ||దేవుఁడే||
1. పర్వతముల కదిలిన నీ యుర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్ అభయ మభయ మభయ ||దేవుఁడే||
2. దేవుఁ డెప్డు తోడుగాఁగ దేశము వర్ధిల్లును ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు అభయ మభయ మభయ ||దేవుఁడే||
3. రాజ్యముల్ కంపించిన భూ రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ యెహోవా వైరిఁ బూని సంహరించును అభయ మభయ మభయ ||దేవుఁడే||
4. విల్లు విఱచు నాయన తెగ బల్లెము నఱకు నాయన చెల్లచెదర జేసి రిపుల నెల్లఁద్రుంచు నాయనే అభయ మభయ మభయ ||దేవుఁడే||
5. పిశాచి పూర్ణబలము నాతోఁ బెనుఁగులాడ జడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును అభయ మభయ మభయ ||దేవుఁడే||
6. కోటయు నాశ్రయమునై యా కోబు దేవుఁ డుండఁగ ఏటి కింక వెరవ వలయు నెప్డు నాకుఁ బండుగ యభయ మభయ మభయ ||దేవుఁడే||
