← కీర్తనలు

404. కష్టకాలమందు నోదార్పు

రాగం: ముఖారి|తాళం: కురుంజంపె|రచయిత: బేతాళ జాన్

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
జడియకుము నే నే యున్నానని కడు నెనరు వాక్కిచ్చిన యేసుని యడుగుజాడలు వెంబడించి నడుచుకొనరాదా జీవా యిడుమ లధికము గలిగిన ప్రభుని కడకుఁ జేరరాదా ||జడియకుము||
1.  ఇప్పుడు నిను బాధపరచెడి ముప్పులం దలపోసి తప్పక గొప్ప ప్రేమార్థంపు శిక్షకు నొప్పియుండరాదా నీ తప్పులన్ విడి ప్రభువు నందు మెప్పు బొందరాదా ||జడియకుము||
2.  ఘనము ధనము సౌఖ్యంబు బోయి వ్యసనము శోధన మున్న యోబు మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పరపలేదా నీ మనసు దృఢంబటుల జేసి మహిమ పరపరాదా ||జడియకుము||
3.  బీద లాజరుండు భువిని బాధ నొందిన సాదృశ్యంపు బోధన నీ మానసమున పాదుకొనలేదా యతఁ డాదరింపఁబడిన విధము మోద మియ్యలేదా ||జడియకుము||
4.  మున్ను సైఫనును రాళ్లతోఁ గొట్టు చున్న పగతుర కొరకు దేవుని మిన్ను వైపునఁ జూచి యోర్చి మన్న నడుగలేదా నీ కున్న శ్రమలటు లోర్చఁ బ్రభువు తెన్నుఁ జూపలేడా ||జడియకుము||
5.  భక్త జనులను ఖైదుకు నీడ్చి బాధలు గావించినప్పుడు శక్తి హీనుల మంచు యేసుని శక్తి నమ్మలేదా యా యుక్తసహాయము దొరకువరకా సక్తి నుండలేదా ||జడియకుము||