← కీర్తనలు

406. క్రీస్తుని వెంబడించుట

రాగం: కమాను|తాళం: ఆది|రచయిత: చెట్టి భానుమూర్తి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
మనసు నిచ్చి వినుమా మది ననుసరించి చనుమా ||మనసు||
1.  అరయ యేసు సిలువ యది అమరపురికి త్రోవ ఆ రమ్యమైన త్రోవ యది యనుసరించినావ అది యరసి చూచినావ? ||మనసు||
2.  అది నడచి నడచి పోను ఆనందమిచ్చి చనును అది యేసు సిలువ మ్రాను అది యనుసరింపదగును అది యందరు చనదుగును ||మనసు||
3.  రక్తమయపు బాట నీ ముక్తికదియె యూట భక్తులందరి యెదుట స ద్భక్తి మెరయు పాట లనురక్తి బాడెదరచట ||మనసు||
4.  ఎంత పాపమైన మదికెంత భారమైన ఎంత దయయోగాని యది ఎంత కృపయొ గాని అతి శాంతి నిచ్చులోన ||మనసు||
5.  సాటిలేనిదారి మన స్వామిచూపుదారి మేటికల్వరిదారి జనకోటి దుర్గుణహారి మనకోటకు రహదారి ||మనసు||
6.  వలదులోకమేల నీ వలపు నా కికేల నిలువుమింక చాలు నని బిలుచు యేసుమ్రోల నే గొలుతు కాలమెల్ల ||మనసు||