కీర్తనలు

403. క్రీస్తు పేరటఁ బాడుట

రాగం: ఆనందభైరవి|తాళం: ఆది|రచయిత: అల్లారి పెదవీరాస్వామి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
పాడుదును క్రీస్తు పేర పదము నెంతో వేడుదు నా దివ్యాగురు నివ్విధముఁ జూడఁజూడ మదిలో నెంతో వేడుకగా మీఱె వింత ఱేడుఁ బోలినవా డిహ లేఁడు లేఁడందు నహహా ||పాడుదును||
1.  పెక్కు పాపములలోన మణఁగి నాదు తక్కువ బుద్ధిచే నందణఁగి దిక్కు గానక నుండు వేళ దిక్కయి చనుదెంచి మరల గ్రక్కున కరముఁ జూచి చక్కికిఁ జేర్చి ప్రోచె ||పాడుదును||
2.  మోసపు లోక వాంఛలను వట్టి యాశలతోఁ గూడికొన్న కలలు రోసితిఁ గాన వాని యేసుతోఁ గూడుకొంటి వీసమైనను లేమి లేశము లేదనుస్వామి ||పాడుదును||
3.  పాయ నెన్నటికిని వాసిగాఁ బాస త్రోయను త్రోయను యని చేసెగా రోయక న న్నావిభుఁడు సాయమై రక్షించు నెపుడు నా యనీతి భయములు మాని యాయనే జయంజయమని ||పాడుదును||
4.  చాలు చాలు పాపమా నీ చెలిమి నిత్య కాలము గలిగించు మృత్యుకలిమి యేలికైన నాయిమ్మాను యేలు నాయందు దయను మేలిమి నగుపరచినట్టి జాలినేఁ గంటిఁ గాన ||పాడుదును||
5.  ధరలో దేనికి భయపడను ఎట్టి తరుణమైనను చేయి విడను కరుణామయుండు నన్ను కరుణ నేర్పరచి మున్ను మరణమందును వాని శరణం నాశరణమని ||పాడుదును||