← కీర్తనలు

402. దేవుఁడే మన దిక్కు

రాగం: ఖరహరప్రియ|తాళం: ఆది|రచయిత: గొల్లపల్లి నతానియేలు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దినదినముకు దిక్కు నీవే మా దేవుఁడా మమ్ము కనిపెట్టి కాపాడ నెపుడు కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు||
1.  పనికిమాలిన వారము పాపిష్ఠులము నీదు కనికరమును జూచి కృపతోఁ గావు మమ్ముఁ గావు మమ్ము ||దినదినమునకు||
2.  పాప మైన లోక మైన పిశాచక మైన మమ్ముఁ భట్టి రక్షింప వచ్చినఁ బ్రాపు నీవే ప్రాపు నీవే ||దినదినమునకు||
3.  కష్టములు కాని శోధనలు మమ్ముఁ జుట్టు కొనఁగ నీ కృపనెంతో చూపుదువే చూపుదువే ||దినదినమునకు||
4.  నిందలైన దెబ్బ లైన నీదు నామమున మేము పొందఁబోవు కాలమందుఁ దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు||
5.  సత్యమైన వాక్య మిచ్చి సారమును దెల్పి నీదు నిత్యజీవ మార్గ మందు నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు||
6.  ఆసఁ గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు దాసులపై బ్రతుకునట్లు ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము ||దినదినమునకు||
7.  విశ్వాస నిరీక్షణ ప్రేమ లింపుగా మాకు నీవు శాశ్వతముగఁ బంపించుమీ శ్రేష్టముగను శ్రేష్ఠముగను ||దినదినమునకు||