కీర్తనలు

401. క్రైస్తవ నిర్భయము

రాగం: నాధనామక్రియ|తాళం: ఏక

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే నా మనసా యిరుకునఁ బడి యెడు వేళలోఁ క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది ||వెరువ||
1.  శోధన కాలమునఁ క్రీస్తుని బోధకు చెవి నిమ్మా సాధించెడు సా తానుని వల మరి ఛేదించెడు నిఁకఁ బెదరకు ||వెరువ||
2.  పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తాఁ దెచ్చి పాప మెడలు నని తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను ||వెరువ||
3.  గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను ||వెరువ||
4.  గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే ||వెరువ||
5.  లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని బల్కరుణను బిలువఁగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుఁడై ||వెరువ||
6.  పరిసయ్యునిలోని భావము ప్రభు తాఁ గనుఁగొనుచుఁ తిరిగి పొమ్ము నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను ||వెరువ||