← కీర్తనలు

400. క్రైస్తవుల నిర్భయము

రాగం: ముఖారి|తాళం: అట

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము ||యేసు||
1.  లోక జ్ఞానములోని లోతుఁ దెలిసి మేము లొంగము లొంగము యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము ||యేసు||
2.  దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు ||యేసు||
3.  శుభవర్తమానము సొంపుగా నరులకుఁ జెప్పెదము జెప్పెదము లోక వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము ||యేసు||
4.  నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక ఘాతకుఁడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము ||యేసు||
5.  శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత మూఁకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము ||యేసు||