పల్లవి:
విన రమ్ము యేసు నాధుఁడ నా మనవి నిప్పుడు ఘన మైన నీదు నెనరుచే ననుఁ గావు మెప్పుడు ||విన రమ్ము||
1. ఎక్కడిద్దఱు ముగ్గురు నీ యొక్క పేరటన్ జేరు టెక్కడో నే నక్కడ కే తెంతు నంటివి ||విన రమ్ము||
2. మఱి యెవరు దిక్కు ధరణిలోన వేఱు లేరుగా దుర్నరుల కెల్లఁ దెరవుఁ దెల్పి నావు నీవెగా ||విన రమ్ము||
3. మరణ మైతి వాహాహా నా కొరకు సిల్వపై నీ కరుణ కల్గె నెంత యీ దు రాత్ముని నాపై ||విన రమ్ము||
4. సకలంబు నీద టంచు మదిని సంతసించెద వే ఱొకని కించు కంతయైన నుర్వి లేదుగా ||విన రమ్ము||
5. కోరితి నినుదారిగ నను దూరపర్చకు నీ కూరిమి నా కొసఁగి నడుపు మరణావధికి ||విన రమ్ము||
6. వినయంబు సద్గుణంబు చిత్త ముననుఁ గూర్పవే ఘన మైన నీతి యనుభవంబుఁ గలుగఁ జేయవే ||విన రమ్ము||
7. దేవ దేవ రావె నిన్ను సేవఁ జేయుదు ననుఁ బావనునిగఁ జేయవె నేఁ పాప నరుఁడను ||విన రమ్ము||
