కీర్తనలు

381. 'నీవు నన్ను ఆశీర్వదింపని యెడల నిన్ను వెళ్లనియ్యను'

రాగం: తోడి|తాళం: రూపకము|రచయిత: పులిపాక జగన్నాధము

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు ||నిన్ను||
1.  నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని ||నిన్ను||
2.  త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను ||నిన్ను||
3.  నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి ||నిన్ను||
4.  ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని ||నిన్ను||
5.  నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు చేవ గలుగఁ జేయఁ గలవు ||నిన్ను||
6.  అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి ||నిన్ను||
7.  నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి ||నిన్ను||