← కీర్తనలు

383. ఆదర్శ ప్రార్థన

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||
1.  శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ||ప్రార్థన||
2.  పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగ మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
3.  దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||
4.  శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైని నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||