కీర్తనలు

368. క్రైస్తవుని విజయము

రాగం: ఆనందభైరవి|తాళం: ఖండజాతి ఛాఫ్|రచయిత: జి.జాన్ తాతయ్య

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
భయమేల క్రైస్తవుండా నీవిక నపజయమున బ్రతుకనేల జయ శూరుడగు ప్రభువు యిలనీకు జయము నిచ్చుచు నుండగ ||భయమేల||
1.  భూతపీడితుల నెల్ల విడిపించుదాత మన రక్షకుండు సాతాను వల నుండియు విడిపించిప నీతితో మనుపలేడా ||భయమేల||
2.  మరణ పాశములనుండి లాజరును కరుణతో లేపలేదా ధరణిమిమ్ముల నూతన బలముతో గుఱికి నడిపించలేడా ||భయమేల||
3.  ద్రాక్షరసముగ నీళ్లను మార్చిన మహిమగల రక్షకుండు అక్షయ సంతసంబు నిలమీకు దీక్షతో నివ్వలేడా ||భయమేల||
4.  ఐదు చిన్న రొట్టెలు మరి రెండు చిన్న చేపలతోడును ఐదువేల మందిని బలపర్చినట్టి రక్షకుడుండగ ||భయమేల||
5.  విజయకరముగ బ్రతుకు ప్రభువుండు నిజవాగ్దత్తము లివ్వ నీ వృజినము గెలువంగను ముదముతో నిజముగ నెరవేర్చడా ||భయమేల||