← కీర్తనలు

367. క్రీస్తును వెంబడించుట

రచయిత: ఎ.బి.మాసిలామణి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావె నా భాగ్యమా యేసువా ||దేవా||
1.  యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని యేసువాడను నే నంటిని ||దేవా||
2.  ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్ పావనా జూపుము మార్గము ||దేవా||
3.  నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే నావికా రమ్ము నన్ బ్రోవుము ||దేవా||
4.  స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ సత్య సువార్త నే జాటుదున్ ||దేవా||
5.  రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము రక్షణానందము గూర్చుము ||దేవా||