కీర్తనలు

366. క్రీస్తు మనల నెన్నఁడు విడువఁడు

రాగం: నాట|తాళం: ఏక|రచయిత: మేడికాయల సాధువు

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు వంత లెల్ల నెరుఁగుఁగా ||యేల||
1.  తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు చెల్ల చెదరఁ జేసెఁగా ||యేల||
2.  నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి నిన్ను విమలుఁ జేసెఁగా ||యేల||
3.  నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు సకల పదవు లిచ్చి ప్రోచెఁగా ||యేల||
4.  యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా ||యేల||
5.  నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ దరిమి పన్నుగాను బ్రోచెఁగా ||యేల||
6.  సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి యతఁడు నిన్ను ఁ బ్రోవగా ||యేల||