కీర్తనలు

365. క్రైస్తవ యుద్ధప్రేరణము

రాగం: శహన|తాళం: ఆది|రచయిత: పురుషోత్తము చౌదరి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని లేలెమ్ము క్రైస్తవుఁడా నీలో మేల్కొని ||లేలెమ్ము||
1.  విడువకు యుద్ధము నుడువకబద్ధము యొడయుఁడు నీకడ నుండును బాయఁడు ||లేలెమ్ము||
2.  విడువకు ధైర్యము వదలకు కవచము సదయుఁడు క్రీస్తుఁడు సత్ఫల మిచ్చును ||లేలెమ్ము||
3.  బెదరకు మేరికి వదలకు దారిని నది యిది కానిది యాత్మను బెట్టక ||లేలెమ్ము||
4.  ప్రార్థన సారము వర్ధిలఁ గోరుము సార్థక కాలము వ్యర్థము చేయక ||లేలెమ్ము||
5.  భావములోనన్ దేవుని ప్రేమన్ నీవది వేఁడుచు నెమ్మదిఁ గూడుచు ||లేలెమ్ము||
6.  యేసుని సిలువ నెదుట బెట్టుకో మోసము నొందవు యేసుని కాపున ||లేలెమ్ము||