← కీర్తనలు

364. నా ఆత్మా, మేలుకొమ్ము

రాగం: ముఖారి|తాళం: ఆది|రచయిత: పంతగాని పరదేశి

చరణాన్ని గుర్తుంచుకోవడానికి దానిపై నొక్కండి

అక్షర పరిమాణం22
నా యాత్మ! లెమ్ము! సిద్ధము కమ్ము నా రాజిఁ బూని పాయక పోర వలెను నిజమ్ము వేయి శరంబుల నేయుచు శత్రు వ మేయత నిను పడఁ ద్రోయఁ దెగించెను ||నా యాత్మ||
1.  వేచి ప్రార్థించి యుద్ధము సలుపు వీరాకృతి బోరుము వే జయము కలుగు నని యెంచకుము ఏంచుచుఁ బ్రతిదిన మేసట బోరుచు యా చించి గురు స హాయము బొందుము ||నా యాత్మ||
2.  జయము నొందితి నని తలఁపకుము సౌఖ్యమునకై స మయ మపే క్షించి కూర్చుండకుము నియమిత మకుటము నీ వొందువరకు నిర్భర యుద్ధము నిలువదు నమ్ముము ||నా యాత్మ||
3.  పోరు పోరాడు నిను మరణము దేవుని యొద్దఁ జేరు దనుక వీడకు రణము శ్రీ రమ్యుని ది వ్యారామంబునఁ జేరి సుఖింపఁగఁ జేకొని నిను విను ||నా యాత్మ||