పల్లవి:దాపుఁజేరుచుఁ బాడుము జీవపు మాటలన్ మాధుర్యంబగు గానము మరలఁ బాడుము జీవమైన పాటన్ త్రోవఁజూపు మాటన్ || సుందర మానందముగన్ సొంపుగఁ బాడుము ||
1. నిత్యజీవము నిచ్చెడు నిపుణుఁ డేసుఁడు సత్యప్రేమ నొసంగెడు సదయుఁ డేసుఁడు మితిలేని ప్రేమ మింటికాకర్షించున్.
2. ప్రచురపర్చుఁ డెల్లడన్ ప్రభుని రక్షణన్ దాచఁగూడని సత్యమున్ పూర్ణ క్షమాపణన్ రక్షకుని చెంత ఆశతోడ రండు
